26-03-2025 04:49:45 PM
బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని శ్రీ ఆంజనేయ స్వామి దీక్ష స్వాముల 16వ సామూహిక మహా మండల పూజ, విశ్వశాంతి కొరకు సుదర్శన సహిత అష్టోత్తర 108 శత కుండాత్మక 158వ మహా యజ్ఞం, శ్రీ భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం, వడల పూజ, మహోత్సవ బాన్సువాడ మండల మహా పడిపూజ కరపత్రాలను బుధవారం రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ శాసనసభ్యులు, పోచారం శ్రీనివాస్ రెడ్డి స్వగృహంలో ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏప్రిల్ 1వ తేదీ మంగళవారం నాడు అంగరంగ వైభవంగా స్థానిక శ్రీశ్రీశ్రీ విద్య జ్ఞాన సరస్వతి దేవి ఆలయ ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు.
హనుమాన్ దీక్ష పీఠం పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ దుర్గాప్రసాద్ స్వామీజీ వారి కనకములచే కార్యక్రమం నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు. ఉదయం 8:15 నిమిషాల నుండి రాత్రి 11:50 వరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ సదా అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకొని, సకాలంలో అధిక సంఖ్యలో హాజరై ,మహా మండల పూజ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో జ్ఞాన సరస్వతి దేవి ఆలయం ప్రధాన అర్చకులు కాశీ సంతోష్ శర్మ, బాన్సువాడ సొసైటీ చైర్మన్ ఎర్వాల కృష్ణారెడ్డి, బాన్సువాడ నల్ల పోచమ్మ ఆలయం గౌరవ అధ్యక్షుడు హనుమంతరావు పటేల్ తో పాటు శ్రీ హనుమాన్ దీక్ష సేవా సమితి రాష్ట్ర ప్రచార కార్యదర్శులు అంబిలి పూర్ రాజు స్వామి, పాలకుర్తి దత్తు స్వామి, తో పాటు మండల కన్వీనర్ గాండ్ల తేలి ఉమా మహేష్ కుమార్ స్వామితోపాటు ప్రతినిధులు గోక న్ శంకర్ గౌడ్ స్వామి, కల్లేటి వెంకటరమణ స్వామి, కాల గడ్డ నరేష్ స్వామి ,చంద్రశేఖర్ స్వామి, ఉమేష్ స్వామి, ఏ ల్లగోని సాయిబాబా గౌడ్ తో పాటు హనుమాన్ మాల ధరించిన స్వాములు ,తదితరులు, పాల్గొన్నారు.