calender_icon.png 5 October, 2024 | 4:42 PM

తిమ్మాపూర్ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న పోచారం

05-10-2024 01:29:54 PM

ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహణ 

పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ పూజారులు

కామారెడ్డి  (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తిమ్మాపూర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారిని ఆలయ కమిటీ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. చిన్న తిరుపతిగా భావించే శ్రీ వెంకటేశ్వర స్వామిని పోచారం ప్రత్యేక శ్రద్ధతో ఆలయాన్ని నిర్మించారు. బాన్సువాడ పట్టణానికి వచ్చినప్పుడల్లా ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించడం పోచారం శ్రీనివాస్ రెడ్డి చేపడుతారు. అందులో భాగంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు రాష్ట్ర ఆగ్రో కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు తో పాటు కలిసి పోచారం శ్రీనివాస్ రెడ్డి తిమ్మాపూర్ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు.

అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దయవల్ల బాన్సువాడ జుక్కల్ నియోజకవర్గ ప్రజలు కాకుండా కామారెడ్డి నిజామాబాద్ జిల్లా భక్తులు పెద్ద ఎత్తున వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి తిరుపతికి వెళ్లలేని వారు చిన్న తిరుపతిగా భావించి తిమ్మాపూర్ వెంకటేశ్వర స్వామి కుటుంబ సమేతంగా వచ్చి దర్శించుకుని పూజలు నిర్వహిస్తున్నారని ఆ దేవుని కృప భక్తులపై ఉంటుందని ఆయన తెలిపారు. వారితోపాటు కాంగ్రెస్ నాయకులు కృష్ణారెడ్డి, అంజిరెడ్డి, మల్లికార్జున్ ,నరేందర్ ,లక్ష్మణ్, గురు వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.