24-02-2025 12:00:00 AM
బాన్సువాడ, ఫిబ్రవరి 23 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని పలు వివాహాది శుభకార్యాలకు ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. పలువురు నూతన దంపతులను ఆయన ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి బాన్సువాడ పట్టణ శివారులోని ఎస్ ఎమ్ బి ఫంక్షన్ హాల్ లో బంజారా సేవా సంఘం అధ్యక్షుడు బద్యా నాయక్ కుమార్తె వివాహా వేడుకకు హాజరై నూతన వధూవరులు దివ్య భారతి - ధనరాజ్ లకు శుభాకాంక్షలు తెలిపారు. బాన్సువాడ పట్టణంలోని భారత్ గార్డెన్‌లో తూప్రాన్ శ్రీనివాస్ గౌడ్ కుమారుని వివాహానికి హాజరై నూతన వధూవరులు అభిలాష్ గౌడ్, యామినిలకు శుభాకాంక్షలు తెలిపారు.
బాన్సువాడ పట్టణ కేంద్రంలోని లక్ష్మి నరసింహ కళ్యాణ మండపంలో బాన్సువాడ మాసాని మధుసూదన్ రెడ్డి కుమారుడు సాయికిరణ్ రెడ్డి, తాడ్కోల్ శ్రీనివాస్‌రెడ్డి కుమార్తె నితిషాల వివాహా నిశ్చితార్థ వేడుకకు హాజరై కాబోయే వదూవరులు నితీషా - సాయి కిరణ్ రెడ్డిలకు శుభాకాంక్షలు తెలిపారు. బాన్సువాడ గ్రామీణ మండలం రాంపూర్ తండాలో బానోత్ దశరథ్ కుమార్తె వివాహా వేడుకకు హాజరై నూతన వధూవరులు సింధు - విశ్వనాథ్ లకు శుభాకాంక్షలు తెలిపారు. వర్ని మండల కేంద్రంలోని వి ఎం ఆర్ ఫంక్షన్ హాల్లో అక్బర్ నగర్ విఠబాయి కుమారుని వివాహానికి హాజరై నూతన వధూవరులు గుండె రావు - మహానంద లకు శుభాకాంక్షలు తెలిపారు.
బోధన్ పట్టణ కేంద్రంలోని అప్నా ఫంక్షన్ హాల్ లో రుద్రూర్ బుద్దే శంకర్ కుమారుని వివాహానికి హాజరై నూతన వధూవరులు శ్రీకాంత్ - ఆద్య లకు శుభాకాంక్షలు తెలిపారునవీపేట్ మండల పరిధిలోని జన్నెపల్లి మహేశ్వరీ గార్డెన్ లో బోయి ఇసుక లక్ష్మణ్ కుమార్తె వివాహా వేడుకకు హాజరై నూతన వధూవరులు సరోజ, రాకేశ్ లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వివాహాది శుభకార్యాలకు బాన్సువాడ నియోజకవర్గ నాయకులు, ప్రజాప్రతినిధులు పోచారం వెంట ఉన్నారు.