calender_icon.png 18 April, 2025 | 8:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోనాల పండుగలో పాల్గొన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి

15-04-2025 06:49:08 PM

బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని 12వ వార్డులో మంగళవారం నల్ల పోచమ్మ తల్లి ఆలయంలో జరిగిన బోనాల పండుగలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు బోనం ఎత్తుకొని అమ్మవారికి బోనం సమర్పించిన పోచారం. ఈ సందర్భంగా అమ్మవారి దీవెనలతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, ప్రతి ఒక్కరికి ఆ తల్లి దీవెనలు లభించాలని కోరుకున్న పోచారం. బోనాల పండుగలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాసాని శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ అంజవ్వ, మంత్రి గణేష్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు అంబర్ సింగ్, ఎరువాల కృష్ణారెడ్డి, అంజిరెడ్డి, నార్ల సురేష్ గుప్త, బాన్సువాడ పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.