తండ్రి కొడుకుల అంత్యక్రియాలు
శోకసంద్రమైన బస్వాపూర్ గ్రామం
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని బస్వాపూర్ గ్రామంలో కోటగిరి మాజీ జెడ్పీటీసీ శివరాజ్ దేశాయ్ అతని కుమారుడు రాజశేఖరుల అంత్యక్రియలు గురువారం గ్రామంలో నిర్వహించారు. తమ గ్రామ పెద్ద మనిషి ఆయన కుమారుడు కారు ప్రమాదంలో బుధవారం మృతిచెందడం పట్ల బస్సు గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. తమకు అన్ని విధాల అండగా నిలిచిన పెద్దాయిన తమ నుంచి దూరం అవుతున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. అందరితో కలుపుగోలుగా ఉండే పెద్దాయన ఏ ఆపద వచ్చిన తమకు అండగా నిలిచేవాడని గ్రామస్తులు తెలిపారు.ఈ అంతక్రియాల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహదారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తన అనుచరులతో కలిసి అంత్యక్రియలు ముగిసే వరకు గ్రామంలోనే ఉన్నారు. దేశాయి కుటుంబ సభ్యులను ఓదార్చారు. కాంగ్రెస్ పార్టీ ఒక సీనియర్ మంచి నాయకున్ని కోల్పోయిందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జీ మాజీ ఎమ్మెల్యే ఏనుగురవీందర్ రెడ్డి తన అనుచరులతో కలిసి పాల్గొన్నారు. శోకతృప హృదయాలతో తండ్రి కొడుకుల అంత్యక్రియలను గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు.