15-02-2025 11:04:27 PM
రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి
కామారెడ్డి,(విజయక్రాంతి): సంత్‌సేవాలాల్ మహరాజ్ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం పోచారం, రాంపూర్‌తండాల్లో సంత్‌సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంత్‌సేవాలాల్ మహరాజ్ మహనీయుడని ఆయన ఆశయాలను గిరిజనులు అనుసరించి అభివృద్ది పథంలోకి వచ్చరన్నారు. భవానిమాత ఆలయంలో పూజలు నిర్వహించారు. సేవాలాల్ మహరాజ్ మార్గంలో ప్రతి గిరిజనుడు నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో భవానిమాత ఆలయ కమిటి అధ్యక్షుడు బలరాంనాయక్, మోహన్‌నాయక్, గోప్యనాయక్, ప్రకాష్, హరిసింగ్, చందర్, కృష్ణారెడ్డి, బన్సీలాల్, విఠల్ తదితరులు పాల్గొన్నారు.