కామారెడ్డి,(విజయక్రాంతి): సమాజానికి శాంతి ప్రేమను ప్రబోధించిన శాంతి దూత దైవ కుమారు యేసుక్రీస్తు బోధనలు మానవాళికి మార్గదర్శకులుగా నిలిచారని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం క్రిస్మస్‌వేడుకల్లో కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో నిర్వహించిన క్రిస్మస్ పండుగలో పాల్గొని మాట్లాడారు. భారతదేశం భిన్న మతాల, కులాల సముహమన్నారు.
మన ఆచారాలను గౌరవిస్తూ, ఇతరుల ఆచారాలను కూడా గౌరవించడం మానవత్వం అన్నారు. సమాజానికి శాంతి, ప్రేమను ప్రభోదించిన శాంతి, దూత దైవకుమారుడు యేసుక్రీస్తు బోధనలు మానవాళికి మార్గదర్శకాలు అని తెలియజేశారు. ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా శాంతి, సామరస్యాలను పాటిస్తూ సమస్త మానవాళికి సుఖ, శాంతులను అందించాలని ఏసుక్రిస్తు ప్రభువును కొరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అగ్రో కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్, ఆంజిరెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.