calender_icon.png 11 January, 2025 | 5:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి

04-01-2025 10:01:31 PM

ఆసుపత్రి భవన నిర్మాణ పనులను నాణ్యతతో చేపట్టాలి

 కాంట్రాక్టర్‌ను ఆదేశించిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి

కామారెడ్డి,(విజయక్రాంతి): వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణ పనులను(100 Bed Government Hospital Building Construction Works) శనివారం రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి(MLA Pocharam Srinivas Reddy) పరిశీలించారు. కామారెడ్డి జిల్లా(Kamareddy District), బాన్సువాడ(Banswada)లో నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణ పనులను పరిశీలించి సంబంధిత కాంట్రాక్టర్‌తో మాట్లాడి ఆసుపత్రిని నాణ్యతతో చేపట్టాలని సూచించారు. రూ.37.50 కొట్లతో నిర్మిస్తున్న వంద పకడల ఏరియా ఆసుపత్రి పనులను పరిశీలించారు. పనులను వేగవంతంగా చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్‌పర్సన్ జంగంగ గంగాధర్, స్థానిక నాయకులు కృష్ణారెడ్డి, అంజిరెడ్డి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.