14-03-2025 06:33:49 PM
బాన్సువాడ,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయసలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస రెడ్డి బంజారాహిల్స్ లోని తన నివాసంలో మనుమలు రిషిక్ రెడ్డి, రుషాంక్ రెడ్డి లతో కలిసి హోలి సంబురాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అందరూ కలిసి జరుపుకునే హోలీ పండుగ మన అందరి జీవితాల్లో కొత్త రంగులు నింపాలని, కామ దహనం చేసి, రంగులు చల్లుకుని, ఆనందం పంచుకుని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పోచారం హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.