18-04-2025 12:00:00 AM
బాన్సువాడ, ఏప్రిల్ 17 (విజయ క్రాంతి), కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఎం ఎల్ ఎ క్యాంపు కార్యాలయంలో గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్ సి కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగా మహిళలకి అందిస్తున్న ఉచిత కుట్టు మిషన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఉచిత కుట్టు మిషన్ లను మహిళ లబ్ధిదారులకు అంద చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి ,రాష్ట్ర అ్రగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజు, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, కామారెడ్డి జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దయానంద్. పట్టణ ప్రజాప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.