calender_icon.png 5 March, 2025 | 2:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోట దుర్గమ్మ ఉత్సవాల్లో పాల్గొన్న పోచారం

04-03-2025 11:46:30 PM

బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ కేంద్రంలోని కోటగళ్లిలో శ్రీ కోట దుర్గమ్మ దేవి ఆలయం ద్వితీయ వార్షికోత్సవ కార్యక్రమానికి మంగళవారం ముఖ్య అతిథిగా పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతోపాటు రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు పాల్గొన్నారు. గత మూడు రోజులుగా ద్వితీయ వార్షికోత్సవం ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. చివరి రోజులో భాగంగా మహ పూర్ణాహుతి కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులతో కలసి పాల్గొ న్నారు.భక్తులు ఏర్పాటు చేసిన అన్నప్రసాదాన్ని పోచారం శ్రీనివాస్ రెడ్డి స్వీకరించారు.