calender_icon.png 6 March, 2025 | 9:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాల్లో పాల్గొన్న పోచారం

06-03-2025 06:56:21 PM

బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం పోతంగల్ మండలం దోమలెడిగి గ్రామంలో గురువారం నిర్వహించిన 8వ అఖండ హరినామ సప్తహా కార్యక్రమం రుక్మిణీ పాండురంగ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఉత్సవాలకు ముఖ్యతిథిగా రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విఠలేశ్వర స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోతంగల్ మండల ప్రజాప్రతినిధులు నాయకులు పాండురంగా స్వామి భక్తులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.