calender_icon.png 26 November, 2024 | 2:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రవీందర్ రెడ్డి అనుచరులపై పోచారం అనుచరుల దాడి

12-09-2024 11:14:33 AM

వడ్డేపల్లి గ్రామంలో భీమశంకర్ పై దాడి

పోలీసు స్టేషన్లో మరోసారి దాడి చేసిన పోచారం అనుచరులు

బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ గ్రూపుల మధ్య తగాదా

పేరు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు

కామారెడ్డి, (విజయక్రాంతి): బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ గ్రూప్ రాజకీయాలు ఘర్షణల వరకు దారితీసింది. బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి అనుచరులపై ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెసులో చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్గీయుల మధ్య గ్రూపు తగాదాలు నెలకొన్నాయి. బుధవారం రాత్రి ఏనుగు రాజేందర్ రెడ్డి వర్గానికి చెందిన వడ్డేపల్లి  గ్రామ కాంగ్రెస్ నాయకులు భీమశంకర్ ఇంట్లో భీమశంకర్ పై అతని కొడుకు పై దాడి చేశారు. శ్రీనగర్ నెహ్రు నగర్ గ్రామానికి చెందిన టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వచ్చిన ఏఎంసీ మాజీ చైర్మన్ గోపాల్ కుమారులు వెలగపూడి జయంత్ వెలగపూడి యశ్వంత్ శ్రీనగర్ మాజీ ఉప సర్పంచ్ ముప్పవరం అన్వేష్ అన్వేష్ అన్వేష్ నెహ్రూ నగర్ మాజీ సర్పంచ్ నాని బాబు శ్రీనగర్ మాజీ వార్డ్ మెంబర్ మేక రాజేష్ గంట వేణు చైతన్య అందరు చూస్తుండగానే పోలీస్ స్టేషన్ లో దాడి చేశారని శ్రీనగర్ మాజీ సర్పంచ్ రాజు కోనేరు శ్రీకాంత్ లు కలిసి దాడి చేసినట్లు భీమాశంకర్ పోలీసులకు ఫిర్యాదు  చేశారు.

దీంతో బాన్సువాడ  నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయులకు పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్గీల మధ్య కోల్డ్ వార్ కోన సాగుతుంది. మరికొందరు రవీందర్ రెడ్డి అనుచరులపై అక్రమ కేసులు పెట్టించారని పోచారం శ్రీనివాస్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కు జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు రవీందర్ రెడ్డి వారి అనుచరులు ఫిర్యాదు చేశారు. బుధవారం రాత్రి రవీందర్ రెడ్డి అనుచరుడు కాంగ్రెస్ సీనియర్ నాయకులు భీమా శంకర్ పై దాడి జరగడంతో రవీందర్ రెడ్డి వర్గీయులు పోచారం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి  తనయుడు భాస్కర్ రెడ్డి ప్రోద్బలంతోనే బలంతోనే దాడులు చేశారని పార్టీ అధిష్టానం దాడి చేసిన పోచారం అనుచరులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు వాపుతున్నారు.

అనవసరంగా దాడులకు పాల్పడుతూ రెచ్చగొట్టే విధంగా వీఆర్ఎస్ నుంచి వచ్చిన పోచారం శ్రీనివాస్ రెడ్డి అతని అనుచరులు దాడులకు దిగడం సిగ్గుచేటు అయిన విషయం అన్నారు. పెద్దమనిషి హోదాలో ఉండి పోచారం శ్రీనివాస్ రెడ్డి చిల్లర మల్లార రాజకీయాలకు గీయడం సరి కాదని బాన్సువాడ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్చార్జి రవీందర్ రెడ్డి అన్నారు. ఇప్పటికే తమ అంశాలపై అక్రమ కేసులు చేపిస్తూ ఇబ్బందులకు గురిచేయడం పై ఇప్పటికే జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఫిర్యాదు చేసినట్లు రవీందర్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎవరు కూడా అధైర్యపడవద్దని రవీందర్ రెడ్డి తెలిపారు. చిల్లర చేష్టలు చేస్తున్న పోచారం శ్రీనివాస్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. తమను రెచ్చగొట్టే విధంగా వివరించడంతోపాటు తమపై దాడికి పాల్పడ్డాడని భీమాశంకర్ పై వర్ని పోలీసులకు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు చేశారు.

ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసినట్లు వర్ని పోలీసులు తెలిపారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి అనుచరులకు రవీందర్ రెడ్డి అనుచరుల మధ్య బేధాభిప్రాయాలు పెరిగిపోతున్నాయి. పోచారం శ్రీనివాస్రెడ్డి అనుచరులు దాడులకు పాల్పడడంపై బాన్సువాడ నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు పోచారం శ్రీనివాస్ రెడ్డి అనుకూలంగా ఉండకపోవడంతో పోచారం శ్రీనివాస్ రెడ్డి తన అనుచరులతో దాడులకు దిగుతున్నారని రవీందర్ రెడ్డి అనుచరులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని రవీందర్ రెడ్డి వర్గీయులు వాపోతున్నారు.

కాంగ్రెస్ పార్టీ పెద్దలు జోక్యం చేసుకొని వీరు వర్గాల మధ్య సయోధ్య కుదుర్చుకునే కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఒకే తాటి పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి లేకపోతే రాబోయే రోజుల్లో మరిన్ని దాడులు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పుడు దాడుల వరకే వచ్చింది కానీ భవిష్యత్తులో ప్రాణాలు పోయే స్థితి ఏర్పడుతుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. పార్టీ అధిష్టానం ఎంత తొందరలో ఇరు వర్గాలను సయోధ్య కుదుర్చుతే ప్రయోజనం ఉంటుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు భావిస్తున్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్గీయులకు రవీందర్ రెడ్డి వర్గీల మధ్య పోరు కోన సాగుతుంది. రవీందర్ రెడ్డి అనుచరులపై దాడి జరగడంపై నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి హుందాగా వ్యవహరించాలని చిల్లర రాజకీయాలకు పోద్బలం చేయవద్దని సీనియర్ కాంగ్రెస్ నాయకులు వాపోతున్నారు.