calender_icon.png 24 January, 2025 | 1:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కారు దిగిన ఎమ్మెల్యేలకు ‘పోచారం’ దావత్

01-08-2024 01:33:28 AM

మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి కారు దిగిన ఎమ్మెల్యేలకు దావత్ ఇచ్చారు. బుధవారం రాత్రి తన ఇంట్లో ఇచ్చిన విందు భోజనానికి సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీతోపాటు ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను ఆహ్వానించారు. కాంగ్రెస్‌లో చేరిన కారు పార్టీ గద్వాల ఎమ్మెల్యే ఇటీవల యూటర్న్ తీసుకోవడం.. మరికొందరు ఎమ్మెల్యేలు సొంతగూటికి వెళ్తారని ప్రచారం జరుగడంతో పోచారం ఇచ్చిన దావత్ హాట్‌టాపిక్‌గా మారింది. అయితే ఈ విందుకు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మినహా మిగతా వారందరు హాజరయ్యారు.