29-03-2025 01:18:42 AM
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని కోటగిరి మండల కేంద్రంలోని మజీద్ ఆవరణలో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం తరపున ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ముస్లిం సోదరులకు ముందస్తుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కోటగిరి ఎం.ఆర్.ఓ.గంగాధర్, కోటగిరి మండల ప్రజాప్రతినిధులు,అధికారులు, నాయకులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.