26-03-2025 07:30:03 PM
అమ్మవారి గదం కుండ ఎత్తుకున్న బుర్ర రమేష్ గౌడ్..
చిట్యాల (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని చింతలపల్లిలో బుధవారం పోచమ్మ తల్లి బోనాల పండుగను గ్రామస్తులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పోచమ్మ తల్లికి ఇష్టమైన గదం కుండను గ్రామానికి చెందిన బుర్ర రమేష్ గౌడ్ ఎత్తుకున్నారు. డప్పు చప్పుళ్ల మధ్య మహిళలు బోనాలు ఎత్తుకొని పోచమ్మ తల్లి దేవాలయం వరకు వెళ్లారు. బోనాలను నైవేద్యంగా సమర్పించి.. మొక్కులను సమర్పించారు.
అనంతరం గ్రామ పెద్దలు మాట్లాడుతూ... పోచమ్మ తల్లి దీవెనలు ప్రజలందరికీ ఉండాలని, ఆమె ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో, పాడిపంటలతో, అష్టైశ్వర్యాలతో, పిల్లాపాపలతో, కలకాలం నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు చింతల రమేష్ ముదిరాజ్, కోడెల నందకుమార్, పిట్టల రాజమౌళి ఆకుల రవీందర్, అల్లం రవీందర్, ఆకుల హరీష్, సాదుల రవీందర్, అల్లం తిరుపతి, పిట్టల రామచందర్, కోడెల నరసింహరాములు, నరేష్, మూసాపురి సాయిలు, తూముల సంజీవ్, ఓర్సు చేరాలు, భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.