04-03-2025 01:02:55 AM
ప్రత్యేక పూజలు నిర్వహించిన కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్
పటాన్‌చెరు, మార్చి 3 : మండల కేంద్రం జిన్నారంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో సోమవారం పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పటాన్చెరు కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి కాట శ్రీనివాస్గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మాజీ ఎంపీపీ రవీందర్గౌడ్, టీపీసీసీ సభ్యుడు శ్రీనివాస్రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు వడ్డె క్రిష్ణ తదితరులతో కలిసి అమ్మవారిని కాట శ్రీనివాస్గౌడ్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దయతో ప్రజలందరు సంతోషండా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ఆలయ కమిటీ ఉత్సవాలలో పాల్గొన్న నాయకులను సన్మానించింది. మాజీ ఎంపీటీసీ లావణ్యనరేశ్, ప్రతాప్రెడ్డి, తులసీదాస్, నరేందర్గౌడ్ స్థానిక నాయకులు పాల్గొన్నారు.
కిష్టారెడ్డిపేటలో కట్ట మైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట
అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కిష్టారెడ్డి పేటలో సోమవారం కట్ట మైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరింగింది. ఈ ఉత్సవాలలో కిష్టారెడ్డిపేట తాజీ మాజీ ప్రజాప్రతినిధులతో పాటు వివిద రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. అమ్మవారి దయతో ప్రజలందరు సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు నాయకులు, ప్రజలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఈర్ల రాజు, మాజీ సర్పంచ్ ఏర్పుల కృష్ణ, మాజీ వైస్ ఎంపీపీ సత్యనారాయణ, నాగులు గౌడ్, నరసింహా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.