calender_icon.png 28 December, 2024 | 10:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన పీఓ

02-12-2024 06:20:51 PM

ఇల్లెందు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని టేకులపల్లి మండలం కోయగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలను ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్ని తరగతులను, వసతి గృహాలను పరిశీలించారు, వంటగది, వంట పాత్రలను, స్టోర్ రూంలను పరిశీలించారు. ప్రైమరీ పాఠశాల ప్రత్యేకంగా పరిశీలించి ఉద్దీపాకము పుస్తకాల గురించి కొన్ని ప్రశ్నలు విద్యార్థులను అడిగారు. గణితము, ఇంగ్లీష్, బ్లాక్ బోర్డుపై రాయించడం, అడగడం చేశారు. ఉత్తమ సమాధానాలు ఇచ్చిన విద్యార్థులను చిన్న  (గణితం, ఆంగ్లం) బహుమతులు (నోట్స్, పెన్స్) అందించారు. పదో తరగతిని పరిశీలించి విద్యార్థులకు కొన్ని ప్రశ్నలను అడిగి తెలుసుకున్నారు. తొమ్మిదో తరగతిలో హిందీ చదివించి తెలుగు లో అర్ధాలు చెప్పమని అడిగారు. అన్ని విషయాలు అడిగి మంచి సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు ఏటిడిఓ రాధ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. అమార్ సింగ్  పాల్గొన్నారు.