28-04-2025 08:08:10 PM
భద్రాచలం (విజయక్రాంతి): వైజాగ్ లోని గీతం యూనివర్సిటీ(Gitam University)లో వివిధ రాష్ట్రాలు పాల్గొన్న రాష్ట్రస్థాయి గిరిజన ఆర్చరీ క్రీడలలో ఐటీడీఏ భద్రాచలం ఓరల్ ఛాంపియన్షిప్ సాధించడం చాలా సంతోషకరమని క్రీడల యొక్క విజయాత్ర ఇంతటితో ఆగకుండా జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడలలో పాల్గొని భద్రాచలం ఐటిడిఏ కు మంచి గుర్తింపు తీసుకొనిరావాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్(ITDA Project Officer B. Rahul) అన్నారు.
సోమవారం తన ఛాంబర్ లో ఏప్రిల్ 25, 26, 27 తేదీలలో వైజాగ్ లో జరిగిన రాష్ట్రస్థాయి గిరిజన ఆర్చరీ క్రీడలలో ఆంధ్రప్రదేశ్, కేరళ, రాజస్థాన్, ఒరిస్సా, అండమాన్ నికోబార్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి గిరిజన విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్న ఆర్చరీ క్రీడలలో భద్రాచలం ఐటీడీఏ తరపున ఆశ్చర్య క్రీడలలో పాల్గొని బంగారు పతకాలు సాధించి రాష్ట్రస్థాయి ఓవరాల్ ఛాంపియన్ షిప్ కైవసం చేసుకున్న క్రీడాకారులకు ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... క్రీడలలో గెలుపోటములు అనేది సహజమని ఆడే ప్రతి ఆట గెలవడానికి ప్రయత్నించాలని అన్నారు.
టీం మొత్తం కలిసికట్టుగా ఉండి పీడీలు పీఈటీలు కొచులు విద్యార్థిని విద్యార్థులకు అందించిన సహాయ సహకారాలు, సలహాలు, సూచనల వలన ఇంతటి పెద్ద విజయం సాధించారని అన్నారు. విద్యార్థిని విద్యార్థులు తప్పనిసరిగా ప్రతిరోజు ఆర్చరీత్తో పాటు ఇష్టమైన క్రీడలలో పాల్గొని మీయొక్క ఆటను మెరుగుపరచుకొని అంతర్జాతీయ స్థాయిలో పాల్గొని అత్యధిక పథకాలు సాధించి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సంపాదించుకోవాలని ఆయన అన్నారు.
ఐటీడీఏ భద్రాచలం, గిరిజన సంక్షేమ శాఖ కచనపల్లి క్రీడా పాఠశాల నుండి 08 మంది క్రీడాకారులు పాల్గొన్నారనీ, 04 మంది పీడీ, పీఈటీస్ కోచులుతో కలిపి 12 మంది రాష్ట్రస్థాయి గిరిజన ఆర్చరీ క్రీడల్లో పాల్గొని అండర్ 19, అండర్ 20, సీనియర్, జూనియర్ బాలబాలికలు పాల్గొని క్రీడలలో విజయం సాధించి ఓవరాల్ ఛాంపియన్షిప్ గెలుచుకొని మన ఐటీడీఏ కు మంచి పేరు తీసుకురావడం చాలా సంతోషంగా ఉందని, ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు, పిడి, పిఈటి, కోచులకు అభినందిస్తున్నట్లు ఆయన అన్నారు. పిల్లలు చదువుతో పాటు ఇష్టమైన క్రీడలలో తప్పనిసరిగా పాల్గొనాలని, క్రీడలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని మారుమూల ప్రాంతాల్లో ఉన్న గిరిజన పిల్లలు దృఢంగా మంచి మేధాశక్తి కలిగి ఉంటారని, వారికి ఇష్టమైన క్రీడలలో తప్పనిసరిగా ప్రోత్సాహం అందిస్తే విజయం సాధించి మెడల్స్ సాధించి పెడతారని అన్నారు.
మీకు కావాల్సిన క్రీడా మెటీరియల్స్ తప్పనిసరిగా అందిస్తానని ఆయన అన్నారు. అనంతరం రాష్ట్రస్థాయి ఆర్చరీ క్రీడలలో పాల్గొనీ మెడల్స్ సాధించిన విద్యార్థిని విద్యార్థులకు పథకాలు అందించి అందరికీ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ, స్పోర్ట్స్ ఆఫీసర్ గోపాలరావు, అసిస్టెంట్ స్పోర్ట్స్ ఆఫీసర్ వెంకట్ నారాయణ, వ్యాయామ ఉపాధ్యాయులు నాగ శ్యామ్, హెచ్ఎం వెంకటేశ్వర్లు, కోచ్ మారెప్ప విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.