calender_icon.png 15 January, 2025 | 2:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

10న పీఎన్‌జీ జ్యువెలర్స్ ఐపీవో

06-09-2024 12:00:00 AM

ప్రైస్‌బ్యాండ్ రూ.456

ముంబై, సెప్టెంబర్ 5: జ్యువెలరీ రిటైల్ చైన్ నిర్వహిస్తున్న పీఎన్ గాడ్గిల్ జ్యువెలర్స్ రూ.1,100 కోట్ల సమీకరణకు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) జారీచేయనున్నది. రూ.456 ప్రైస్‌బ్యాండ్‌తో ఈ ఐపీవో సెప్టెంబర్ 10న ప్రారంభమవుతుంది. 12న ముగుస్తుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు ఈ ఆఫర్ ఒక రోజు ముందుగా సెప్టెంబర్ 9న ఓపెన్ అవుతుందని కంపెనీ తెలిపింది. రూ.850 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీచేస్తుండగా, మరో రూ.250 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) మార్గంలో ప్రమోటర్లు విక్రయి స్తారు. తాజా ఈక్విటీ ద్వారా సమీకరించే నిధుల్లో రూ.393 కోట్లు 12 కొత్త స్టోర్లను తెరిచేందుకు, రూ.300 కోట్లు రుణాల చెల్లింపునకు వినియోగిస్తామని, మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్పొరేట్ అవసరాలకు ఉపయోగిస్తామని కంపెనీ వివరించింది.