05-04-2025 11:23:17 PM
డాక్యుమెంటరీ వీడియో విడుదల చేసిన రైల్వే శాఖ..
చెన్నై: శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ రామేశ్వరం వద్ద సముద్రంలో నిర్మించిన కొత్త పంబన్ రైల్వే బ్రిడ్జ్‌ను ఆదివారం ప్రారంభించనున్నారు. దీంతో పాటు మరికొన్ని ప్రాజెక్టులను ఆయన దేశానికి అంకితం చేయనున్నారు. కాగా రైల్వే శాఖ పంబన్ బ్రిడ్జ్ నిర్మాణ విశేషాలను డ్యాక్యుమెంటరీగా రూపొందించిన వీడియోను ‘ఎక్స్’ వేదికగా పంచుకుంది. మొదట వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్‌ను ఓపెన్ చేయనున్న మోదీ ఆ తర్వాత రామేశ్వరం మధ్య నడిచే కొత్త రైలును ప్రారంభించనున్నారు. అనంతరం కొత్త వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్ నుంచి వెళ్లే కోస్టు గార్డు షిప్‌కు కూడా ఆయన పచ్చజెండా ఊపనున్నారు. ఆ తర్వాత ప్రధాని మోదీ రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయాన్ని మధ్యాహ్నం 12.45 నిమిషాలకు సందర్శించనున్నారు. ఈ సందర్భంగా తమిళనాడులో 8300 కోట్ల ఖరీదైన వేర్వేరు రైల్వే, రోడ్డు పనులను ఆయన దేశానికి అంకితం చేస్తారు.