calender_icon.png 19 March, 2025 | 1:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీఎం శ్రీని రద్దు చేయాలి

19-03-2025 01:34:46 AM

  • ఆ నిధులను ఐసిడిఎస్ కు కేటాయించాలి 

అసెంబ్లీ సమావేశాల్లో పెట్టబోయే బడ్జెట్లో ఐసిడిఎస్ కు నిధులు పెంచాలి.

తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు 48 గంటల నిరసన దీక్ష.

భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 18 (విజయ క్రాంతి) ఐ సి డి ఎస్ ను నిర్వీర్యం చేసే పిఎం శ్రేణి మొబైల్ సెంటర్స్ ని జూన్లో ప్రవేశపెట్టబోయే నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని, వీటిని వ్యతిరేకిస్తూ అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ ప్రభుత్వం కేంద్ర గవర్నమెంట్ కు లేక పంపించాలని, ఐసిడిఎస్ కు సరిపడ నిధులు కేటాయించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎ జె రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మంగళవారం జిల్లా కలెక్టరేట్ 48 గంటల దీక్షను చేపట్టారు.సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీల సమస్యలు పరిష్కరించా లని చేపట్టిన నిరసన దీక్షకు సిపిఎం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు మద్దతు  ప్రకటించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలు తమ న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించాలని వేలాదిమంది అంగన్వాడీలు రాష్ట్రవ్యాప్తంగా నిరసన దీక్షలు చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు.

ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి  న్యాయమైన సమస్యలు పరిష్కరించే వరకు సిపిఎం పార్టీగా మద్దతు తెలియజేస్తూ మీరు చేసే పోరాటంలో కూడా ప్రత్యక్ష భాగస్వామ్యం అవుతామన్నారు. అంగన్వాడి జిల్లా అధ్యక్షులు ఈసం వెంకటమ్మ అధ్యక్షతన జరిగిన సభలో సిఐటియు జిల్లా అధ్యక్షులు కార్యదర్శి ఎ జే రమేష్  మాట్లాడుతూ.

కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు పౌష్టికాహారం అందిస్తున్న డి సి డి ఎస్ సేవలను పేద ప్రజలకు దూరం చేయడానికి పిఎం శ్రీ అని మొబైల్ సెంటర్స్ అని జూన్ మాసంలో ప్రవేశ పెట్టబోయే నూతన జాతీయ విద్యా విధానం ఈ పథకాల పేరుతో అంగన్వాడి కేంద్రాల్లో ఉన్న ప్రీస్కూల్ పిల్లలను తీసుకువెళ్లిన తర్వాత ఐ సి డి ఎస్ ను నిర్వీర్యం చేయడమే అన్నారు. 

 ఇప్పటికే ఈ పథకాలను వ్యతిరేకిస్తూ కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాల తో పాటు  ఇతర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖలు సమర్పించాయని, తెలంగాణ ప్రభుత్వం తక్షణమే కేంద్ర ప్రభుత్వానికి ఈ అసెంబ్లీ సమావేశాల్లో లేఖలు అందజేయాలన్నారు. లేనిపక్షంలో అంగన్వాడీలందరూ పెద్ద ఎత్తున పోరాటాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

అంగన్వాడీలకు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక హామీలు ఇచ్చారని ఇప్పటికీ అనేక పోరాటాలు ధర్నాలు చేసినప్పటికీ ఏ ఒక్క సమస్యను పరిష్కరించకపోవడం విచారకరమన్నారు. ప్రభుత్వం అంగన్వాడీలకు దీక్షాధన 18 వేల రూపాయలు తక్షణమే ఇవ్వాలని, ప్రమోషన్ పొందిన టీచర్స్ అందరికి పూర్తి జీతం చెల్లించాలని, ఉన్న ఏరియర్స్ ను చెల్లించాలని మంత్రి సీతక్క.

ఇచ్చిన హామీ ప్రకారం రిటైర్మెంట్గా టీచర్స్ కు రెండు లక్షలు ఇవ్వాలని, వస్తున్న జీవితంలో ప్రతినెల సగం పెన్షన్ ఇవ్వాలని, ప్రతి నెల మొదటి వారంలో జీతాలు సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం కనీస వేత న 26,000 ఇవ్వాలని చెల్లించాలని, పెండింగ్లో ఉన్న టీ ఏ, డి ఏ లు ఇవ్వాలని, టీ హెచ్ ఆర్ ఇచ్చి మే నెల మొత్తం సెలవులు ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా  అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలను ఉదృతం చేస్తామన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆఫీస్ ధర్నా అనంతరం సమస్యలతో కూడిన వినత్ పత్రాన్ని ఐసిడిఎస్ లో వినతి పత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు ఉపాధ్యక్షులు దొడ్డ రవికుమార్ సహాయ కార్యదర్శి లు కే సత్య శ్రీ వీరన్న గద్దల శ్రీనివాస్ అంగన్వాడి జిల్లా నాయకులు మరియ కళావతి రాధాకుమారి విజయశీల కృష్ణవేణి రాజ్యలక్ష్మి రాధ అచ్చమ్మ భవాని సూరమ్మ  శకుంత సారమ్మ తదితరులు పాల్గొన్నారు.