calender_icon.png 20 March, 2025 | 11:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీఎం శ్రీ పథకం పనుల్లో వేగం పెంచాలి

20-03-2025 12:49:05 AM

కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశం 

కాటారం (భూపాలపల్లి), మార్చి 19 (విజయక్రాంతి) : పిఎం శ్రీ పథకం ద్వారా పాఠ శాలల్లో జరుగుతున్న పనులలో వేగం పెం చాలని,  నాణ్యమైన సామగ్రిని ఉపయోగించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్ట ర్ రాహుల్ శర్మ ఆదేశించారు. బుధవారం పిఎం శ్రీ అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మల్హర్ మండలం, ఎడ్లపల్లి తదితర పాఠశాలలలో పరిశీలించారు.

పాఠశాల మొదటి అంతస్తులో నిర్మిస్తున్న సైన్స్ ల్యాబ్, మరుగుదొడ్ల నిర్మాణం పనులను పరిశీలించారు. ఆర్ ఓ ప్లాంటును పరిశీలిం చి ఉపాధ్యాయులతో మాట్లాడారు. పాఠశా ల మొదటి అంతస్తులో కిటికీ డోర్స్, గ్రిల్స్ తలుపులు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరగా ఏర్పాటు చేస్తామని తెలిపారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని కోరారు. వచ్చే విద్యా సంవత్సరంలో అడ్మిషన్లను పెంచేందుకు కృషి చేయాలని  తెలిపారు.  ఈ కార్య క్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పూర్ణచందర్‌రావు, తహసీల్దార్ రవి కుమార్, ఎంపీడిఓ శ్యాం సుందర్ పాల్గొన్నారు.