calender_icon.png 2 November, 2024 | 5:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెంగాల్‌కు ప్రధాని నరేంద్ర మోడీ హామీ

12-05-2024 03:27:56 PM

పశ్చిమ బెంగాల్: లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ తృణమూల్ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. మమతా బెనర్జీ పాలనలో చొరబాటుదారులు అభివృద్ధి చెందుతున్నారని, పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) అమలును ఎవరూ ఆపలేరని ప్రధాని పశ్చిమ బెంగాల్ ప్రజలకు హామీ ఇచ్చారు. బరాక్‌పూర్‌లో జరిగిన ర్యాలీలో ప్రసంగించిన ప్రధాని మోడీ పశ్చిమ బెంగాల్ ప్రజలకు ఐదు ‘హామీలు’ ఇచ్చారు.  బెంగాల్ లో బిజెపికి ఈ సారి 2019లో కంటే ఎక్కువ సీట్లు వస్తాయని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. బిజెపి గెలుపును ఈ సారి ఎవరూ అడ్డుకోలేరని తెలిపారు. బెంగాల్ బాంబుల తయారీకి కుటీర ప్రరిశ్రమగా మారిందని ఆరోపించారు. సందేశ్ ఖాలీ నిందితులను కాపాడేందుకు టీఎంసీ సర్వశక్తులు ఒడ్డిందని ధ్వజమెత్తారు. 


బెంగాల్ లోని బరాక్ పూర్.. చరిత్ర లిఖించిన గడ్డ, స్వాతంత్ర్య పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించిందన్న ప్రధాని టీఎంసీ హయాంలో పరిస్థితి పూర్తిగా మారిందన్నారు. ఒక సమయంలో బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయటంలో కీలక పాత్ర పోషించేదని, ఇప్పుడు టీఎంసీ.. కుంభకోణాలకు అడ్డగా మారిచ్చిందని ధ్వజమెత్తారు. ఒక సమయంలో బెంగాల్ లో ఒకదాని మించి ఒక శాస్త్రీయ ఆవిష్కరణలు జరిగేవి, టీఎంసీ పాలనలో బాంబుల తయారీ కుటీరపరిశ్రమగా మారిందన్నారు. ఒకప్పుడు చొరబాట్లకు వ్యతిరేకంగా పోరాటం జరిగిన బెంగాల్ లో టీఎంసీ సంరక్షణలో చొరబాట్లు పెరిగిపోయాయని ప్రధాని ఆరోపించారు.