calender_icon.png 20 November, 2024 | 1:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

56 ఏళ్లలో గయానాలో పర్యటించిన తొలి భారత ప్రధాని మోడీ

20-11-2024 11:57:41 AM

గయానా : దేశ ప్రధాని నరేంద్రమోడీ గయానాకు చేరుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు అహ్మద్ ఇర్ఫాన్ అలీ ప్రధాని మోడీకి సాదర స్వాగతం పలికారు. 56 ఏళ్ల తర్వాత ఈ దేశ పర్యటనకు వెళ్లిన తొలి భారత ప్రధానిగా మోడీ రికార్డు సృష్టించారు. ఈ పర్యటనలో భాగంగా ఇర్ఫాన్ అలీతో నరేంద్ర మోడీ భేటీ కానున్నారు. గయానా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మోడీ ప్రసంగించనున్నారు. ఇండియా-కరికోమ్ సదస్సులో ప్రధాని పాల్గొననున్నారు.

గయానా తన అత్యున్నత జాతీయ పురస్కారం "ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్" ను ప్రధాని నరేంద్ర మోడీకి ప్రదానం చేయనుంది. బార్బడోస్ ప్రతిష్టాత్మకమైన గౌరవ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడం ఆఫ్ బార్బడోస్‌ను ప్రదానం చేస్తుంది. డొమినికా కూడా కొద్దిరోజుల క్రితం ప్రధాని మోదీకి అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించింది. ప్రధాని మోదీకి అంతర్జాతీయంగా లభించిన గౌరవాల సంఖ్య 19కి చేరింది. గయానాలో తన అధికారిక పర్యటన నిమిత్తం జార్జ్‌టౌన్‌లో అడుగుపెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ అధ్యక్షుడు డాక్టర్ మహమ్మద్ ఇర్ఫాన్ అలీ,  గ్రెనడా, బార్బడోస్ ప్రధానమంత్రులతో పాటు మరో నలుగురు గయానా మంత్రులు ఆయనకు స్వాగతం పలికారు. ప్రధాని మోదీని కలిసే అవకాశం లభించినందుకు మనమందరం సంతోషంగా ఉన్నామని నేను భావిస్తున్నాను. కారికోమ్‌లోని మనలో చాలా మందికి ఇది ఒక చారిత్రాత్మక క్షణమని బార్బడోస్ పీఎం మియా అమోర్ మోట్లీ అన్నారు.