calender_icon.png 21 September, 2024 | 2:05 PM

గతంలో ఎక్కడ చూసినా రాళ్లదాడులే

19-09-2024 01:20:31 PM

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌లో తన మద్దతును పెంచేందుకు భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ గురువారం శ్రీనగర్, కత్రాలో బహిరంగ ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రధాని మోడీ శ్రీనగర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడుతూ.. గత పాలకుల హయాంలో బాలికల పాఠశాలలు తెరవలేదు, గత పాలకుల హయాంలో సినిమా థియేటర్లు నడవలేదని ప్రధాని ఆరోపించారు.

దాల్ లేక్ లో పర్యాటకులు సందడి చేస్తున్నారని ఆయన తెలిపారు. గతంలో ఎక్కడ చూసిన రాళ్ల దాడులు ఉండేవన్న ప్రధాని మోడీ తాము వచ్చాక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించామని తెలిపారు. రైతుల ఖాతాల్లో ఏటా రూ. 10 వేలు జమ చేస్తున్నామని వెల్లడించారు. తమ ప్రభుత్వం వస్తే రూ. 7 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామన్నారు. కశ్మీర్ లోయలో తన స్థావరాన్ని పటిష్టం చేసుకోవాలనే లక్ష్యంతో బీజేపీ, 47 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 19 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది.  జమ్మూ కాశ్మీర్‌లో బుధవారం అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. మొదటి దశలో 61.11 శాతం పోలింగ్ నమోదైంది. సెప్టెంబర్ 25న, అక్టోబర్ 1న రెండు, మూడో దశలకు పోలింగ్ జరగనుంది.