calender_icon.png 3 February, 2025 | 6:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంగారెడ్డిలో ప్రధానమంత్రి మోడీ దిష్టిబొమ్మ దహనం

03-02-2025 02:40:17 PM

బడ్జెట్ లో తెలంగాణకు నిధులు కేటాయింపు చేయకపోవడంపై నిరసన

ఆందోళనలో పాల్గొన్న నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, టిజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి 

సంగారెడ్డి,(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడంపై కాంగ్రెస్ నాయకులు ప్రధానమంత్రి మోడీ దిష్టిబొమ్మ(PM Narendra Modi Effigy)ను సంగారెడ్డిలో దహనం చేశారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంగారెడ్డి(Sangareddy) పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి ప్రధానమంత్రి మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ నుంచి బిజెపికి చెందిన కేంద్ర మంత్రులు ఉన్న బడ్జెట్ తీసుకురావడంలో విఫలమయాలని వారు ఆరోపించారు. తెలంగాణకు నిధులు కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. రాష్ట్రానికి చెందిన బిజెపి ఎంపీలు నిధులు రాకపోయినా నోరు ఇవ్వడం లేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై ప్రజలకు తెలిపేందుకే నిరసన కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు.