20-02-2025 01:06:03 AM
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: దేశంలోని రైతులకు బీజేపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏడాదికి మూడు విడతల్లో 6వేల రూపాయలు అందించే పీఎం- కిసాన్ సమ్మాన్ నిధి 19వ విడత రూ. 2 వేలను ఈ నెల 24న విడుదల చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఫిబ్రవరి 24న ప్రధాని మోదీ బీహార్‌లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
ఇందులో భాగంగానే పీఎం కిసాన్ 19వ విడత విడుదల చేయనున్నారని అధికారులు పేర్కొన్నారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 9.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలగనుంది. పీఎం కిసాన్ నిధుల్ని అందుకోవాలంటే అర్హులైన రైతులు తప్పనిసరిగా ఎన్‌పీసీఐ, ఆధార్‌తో అనుసంధానించిన బ్యాంకు ఖాతాతో పాటు ఈ కేవైసీ ప్రక్రియను కూడా పూర్తిచేయాలి. లేకుంటే అన్ని అర్హతలు ఉన్నా డబ్బులు జమకావు.