calender_icon.png 10 April, 2025 | 9:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘బంగ్లా’ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

27-03-2025 11:53:32 PM

ఆ దేశ తాత్కాలిక ప్రధానియూనస్‌కు లేఖ..

న్యూఢిల్లీ:  ‘జాతీయ దినోత్సవం సందర్భంగా నేను మీకూ, బంగ్లాదేశ్ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యానికి పునాది పడిన రోజు. ఉమ్మడి చరిత్ర.. త్యాగాలకు ప్రతీక. బంగ్లా విముక్తి యుద్ధం చరిత్రాత్మకం. రెండు దేశాల మధ్య సంబంధాలు ఇక ముందు కూడా ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తున్నా’ అంటూ ప్రధాని మోదీ బుధవారం ఆ దేశ ప్రధాని మహమ్మద్ యూనస్‌కు లేఖ రాశారు.