న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రేపటి నుంచి మూడు రోజుల పాటు జార్ఖండ్, గుజరాత్, ఒడిశాలో పర్యటించనున్నారు. జార్ఖండ్‌లోని టాటానగర్‌లో 660 కోట్ల విలువైన వివిధ రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. సెప్టెంబరు 15న, ప్రధాని జార్ఖండ్‌కు వెళతారు. ఉదయం 10 గంటలకు టాటానగర్-పాట్నా వందే భారత్ రైలును జార్ఖండ్‌లోని టాటానగర్ జంక్షన్ రైల్వే స్టేషన్‌లో జెండా ఊపి ప్రారంభిస్తారు. ఉదయం 10:30 గంటలకు ఆయన శంకుస్థాపన చేసివివిధ రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. గాంధీనగర్‌లో 4వ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్, ఎక్స్‌పోను పీఎం మోడీ ప్రారంభించనున్నారు. ‘సుభద్ర’ పథకం ప్రారంభించి.. భువనేశ్వర్ నుంచి దేశవ్యాప్తంగా 26 లక్షల మంది ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన- గ్రామీణ (PMAY-G) లబ్ధిదారుల గృహ ప్రవేశ వేడుకల్లో ప్రధాన మంత్రి మోడీ పాల్గొననున్నారు.
సెప్టెంబరు 16న ఉదయం 09:45 గంటలకు గాంధీనగర్‌లో ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన లబ్ధిదారులతో సంభాషించనున్నారు. ఆ తర్వాత ఉదయం 10:30 గంటలకు, గుజరాత్‌లోని గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో 4వ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ మరియు ఎక్స్‌పో (రీ-ఇన్వెస్ట్)ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1:45 గంటలకు, ప్రధానమంత్రి అహ్మదాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారంభిస్తారు. సెక్షన్ 1 మెట్రో స్టేషన్ నుండి గిఫ్ట్ సిటీ మెట్రో స్టేషన్ వరకు మెట్రో రైడ్ చేస్తారు. సెప్టెంబరు 17న, ప్రధానమంత్రి ఒడిశాకు వెళతారు. ఉదయం 11:15 గంటలకు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన - అర్బన్ లబ్ధిదారులతో సంభాషిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేస్తారు.