18-03-2025 01:06:48 PM
కుంభమేళా విజయం అందరి కృషి
కుంభమేళా.. ప్రజల్లో ఆధ్యాత్మిక స్ఫూర్తిని పెంచింది
కుంభమేళా జలాలను మారిషస్ కు గిఫ్ట్ గా ఇచ్చా
ప్రపంచం మొత్తం భారతదేశ శక్తిని చూసింది
భారత సామర్థ్యానికి మహా కుంభమేళా ప్రతీక
భిన్నత్వంలో ఏకత్వం అనేది భారత్ ప్రత్యేకత
మన నదులను మనం రక్షించుకోవాలి
న్యూఢిల్లీ: మహా కుంభమేళా(Maha Kumbh Mela)పై లోక్ సభలో ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) మాట్లాడారు. కుంభమేళా విజయం అందిరి కృషి ఫలితం, ప్రపంచం మొత్తం భారతదేశ శక్తిని చూసిందని తెలిపారు. ప్రజలందరి సహకారంతో కుంభమేళా విజయవంతంమైందని చెప్పారు. కుంభమేళా ను విజయవంతం చేసిన ప్రజలను ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఇది భవిష్యత్తు తరాలకు ఒక ఉదాహరణ, కుంభమేళా(Kumbh Mela) ప్రజల్లో ఆధ్యాత్మిక స్ఫూర్తిని పెంచిందని ప్రధాని పేర్కొన్నారు. మన సామర్థ్యంపై ఉన్న అనుమానాలను కుంభమేళా పటాపంచలు చేసిందని వ్యాఖ్యానించారు. ఆధ్యాత్మిక ఐక్యత కోసం దేశమంతా ఒకచోటుకు వచ్చిందని నరేంద్ర మోదీ తెలిపారు.
కుంభమేళా జలాలను మారిషస్ కు బహుమతిగా ఇచ్చానన్న ప్రధాని మోదీ కుంభమేళా జలాలతో మారిషస్(Mauritius)లో పండుగ వాతావరణం నెలకుందని తెలిపారు. మన ఉత్సవాలను జరుపుకోవాలనే ఆకాంక్ష రగిలింది. కుంభమేళాకు పొరుగు దేశాల నుంచి కూడా విశేష ఆదరణ వచ్చింది. పొరుగు దేశాల నేతలు కూడా ప్రయాగ్ రాజ్ సందర్శించారని ప్రధాని స్పష్టం చేశారు. భారత సామర్థ్యానికి మహా కుంభమేళా ప్రతీక.. మహాకుంభమేళా ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చిందన్నారు. మన సంస్కృతులను యువత ఆపాదించుకున్నారు. భిన్నత్వంలో ఏకత్వం అనేది భారత్(Bharat) ప్రత్యేకత అని ఆయన గుర్తుచేశారు. కుంభమేళా ఈ విషయాన్ని మరోసారి చాటిచెప్పిందన్నారు. కుంభమేళా స్ఫూర్తితో దేశవ్యాప్తంగా నదులకు ఉత్సవాలు జరపాలని ప్రధాని సూచించారు. మన నదులను మనం రక్షించుకోవాలని పిలుపునిచ్చారు.