calender_icon.png 23 October, 2024 | 5:53 PM

కోట్ల మంది ప్రేమను.. భారతదేశ మట్టి వాసనను మోసుకువచ్చా : ప్రధాని మోదీ

09-07-2024 01:45:55 PM

రష్యా: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రష్యా పర్యటన కొనసాగుతుంది. రెండు రోజులు పర్యటన నిమిత్తం ప్రధాని సోమవారం ఢిల్లి నుంచి రష్యాకు బయలుదేరిన విషయం తెలిసిందే. భారతీయులను ఉద్దేశించి మాస్కోలో ప్రధాని మోదీ ప్రసంగించారు. నేను ఒక్కడినే రాలేదు.. 140 కోట్ల మంది ప్రేమను భారత దేశ మట్టి వాసనను మోసుకువచ్చాని తీసుకువచ్చాని ఆయన చెప్పారు.

ఇటీవలే 2024 లోక్ సభ ఎన్నికల్లో గెలిచి,  భారత దేశ ప్రధానమంత్రిగా మూడోసారి ప్రమాణస్వీకారం చేసినట్లు తెలిపారు. దీంతో దేశ ప్రజల కోసం మూడు రెట్లు వేగంతో పని చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించారు. భారత్ ను ప్రపంచంలో మూడో ఆర్థిక శక్తిగా నిలబెడతాన్నాని హామీ ఇచ్చారు. భారత్ సాధించిన విజయాలను ప్రపంచం గుర్తిస్తోందన్నారు.

ఏదేశానికి సాధ్యంకాని విధంగా చంద్రయాన్ ప్రయోగం చేశాం, చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా గుర్తింపు పొందామని గర్వంగా మోదీ ప్రసంగంలో చెప్పారు.డిజిటల్ లావాదేవిల్లో ప్రపంచంలోనే భారత్ నబర్ వన్ అని, స్టార్టప్ ల్లో మనం మూడోస్థానంలో ఉన్నామన్నారు. 2014లో వందల్లో ఉన్న స్టార్టప్ లు నేడు లక్షల్లోకి చేరాయని ఆయన పేర్కొన్నారు. భారత్ రికార్డు స్థాయిలో పేటెంట్లను సాధిస్తోందని, ప్రపంచంలోనే అతి పెద్ద ఆరోగ్యబీమా వ్యవస్థ భారత్లో ఉందన్నారు.