23-02-2025 02:19:16 PM
న్యూఢిల్లీ,(విజయక్రాంతి): అంతరిక్ష రంగంలో అనేక విజయాలు సాధిస్తున్నామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi పేర్కొన్నారు. 100వ రాకెట్ ప్రయోగాన్ని సాధించినందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)ను మోడీ ప్రశంసించారు. అంతరిక్ష శాస్త్రంలో భారతదేశం శ్రేష్ఠత సాధనలో ఈ విజయాన్ని ఆయన ఒక స్మారక అడుగుగా అభివర్ణించారు.ఇది కేవలం ఒక సంఖ్య కాదు, అంతరిక్ష శాస్త్రంలో కొత్త ఎత్తులను సాధించాలనే భారతదేశ సంకల్పానికి నిదర్శనం అని ఆయన అన్నారు.
విజయవంతమైన చంద్రయాన్, మంగళయాన్ మిషన్లు, అలాగే భారతదేశం ఒకే మిషన్‌లో 104 ఉపగ్రహాలను రికార్డు స్థాయిలో ప్రయోగించడం కొన్ని కీలక విజయాలను ఆయన గుర్తు చేశారు. గత దశాబ్దంలో భారతదేశం దాదాపు 460 ఉపగ్రహాలను ప్రయోగించింది. వాటిలో చాలా ఇతర దేశాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. భారతదేశ అంతరిక్ష రంగంలో మహిళల భాగస్వామ్యం పెరుగుతున్నందుకు మోడీ సంతోషించారు. ఇది దేశానికి గర్వకారణమన్నారు. అంతరిక్ష రంగంపై యువత అనేక ప్రాజెక్టులు చేపట్టారని హర్షం వ్యక్తం చేశారు.