calender_icon.png 28 October, 2024 | 12:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వడోదరలో స్పెయిన్ ప్రధానితో కలిసి మోడీ రోడ్‌షో

28-10-2024 10:23:05 AM

న్యూఢిల్లీ: గుజరాత్ రాష్ట్రంలోని వడోదర ప్రధాని నరేంద్ర మోదీ, స్పెయిన్ ప్రభుత్వ అధ్యక్షుడు పెడ్రో సాంచెజ్ వడోదరలో రోడ్‌షో నిర్వహించారు. వడోదరలో టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL) సదుపాయంలో C295 విమానాల ఉత్పత్తి కర్మాగారాన్ని ప్రధాని నరేంద్ర మోడీ, స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెబ్ తో కలిసి ప్రారంభించనున్నారు.

భారత్ కు 56 విమానాల సరఫరాకు 2021 సెప్టెంబరులో రూ. 21,935 కోట్లతో ఒప్పందం కుదిరింది.  ఇందులో 16 విమనాలు స్పెయిన్ లోని ఎయిర్ బస్  సంస్థ కర్మాగారం నుంచి అందనున్నాయి. మిగితావి వడోదర యూనిట్ లోనే రూపొందించనున్నారు. స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ తన మూడు రోజుల భారత పర్యటన కోసం సోమవారం తెల్లవారుజామున గుజరాత్‌లోని వడోదర నగరానికి చేరుకున్నారు. భారత్‌లో తన తొలి అధికారిక పర్యటనను ప్రారంభించిన సందర్భంగా సాంచెజ్ విమానం తెల్లవారుజామున 1.30 గంటలకు వడోదర విమానాశ్రయంలో దిగింది. స్పెయిన్‌కు తిరిగి వచ్చే ముందు ఆయన మంగళవారం ముంబైకి వెళ్లనున్నారు. 18 ఏళ్లలో ఏ స్పానిష్ ప్రభుత్వాధినేత భారత్‌లో పర్యటించడం సాంచెజ్ తొలిసారి.