17-02-2025 11:52:28 AM
బీహార్,(విజయక్రాంతి): దేశ రాజధాని ఢిల్లీలో స్వల్ప భూప్రకంపనలు(Tremors) సంభవిస్తున్నాయి. సోమవారం తెల్లవారుజామున 5.35 గంటల సమయంలో ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, గాజియాబాద్ ప్రాంతాల్లో కొద్ది సెకన్లపాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు ప్రాణభయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. రెక్టర్ స్కేల్ పై తీవ్రత 4.0గా నమోదైందని అధికారులు స్పష్టం చేశారు. ఆ సమయంలో భారీ శబ్ధం కూడా వినిపించినట్లు కొందరు స్థానికులు చెప్పారు.
అలాగే బిహార్ లో ఉదయం 8.02 గంటలకు శివాన్ ప్రాంతంలో భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 4గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఉత్తారాదిన వరుస భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో ఇవాళ వచ్చిన భూకంపలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) స్పందించారు. మళ్లి భూ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని, ప్రజలు భయాందోళనకు గురికాకుండా ప్రశాంతంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. పరిస్థితులను అధికారులు సునిశితంగా పరిశీలిస్తున్నారని మోదీ వెల్లడించారు.