న్యూఢిల్లీ: బడ్జెట్ చాలా బాగుందని, అనేక మంది ప్రశంసలు కురిపిస్తున్నారంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) కితాబిచ్చారు. పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగం అనంతరం నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman)తో ప్రధాని మోదీ ఈ మేరకు మాట్లాడారు. బడ్జెట్ లు సాధారణంగా ఖజానాను నింపడంపై దృష్టి సారిస్తాయని, కానీ.. ఈ బడ్జెట్ మాత్రం ప్రజల జేబులు నింపేందుకు, సేవింగ్స్ పెంచేందుకు ఉద్దేశించిందని ప్రదాని మోదీ పేర్కొన్నారు.
ఈ బడ్జెట్ 140 కోట్ల మంది దేశవాసుల ఆకాంక్షలను ప్రతిబింబిస్తోందని, ప్రతి భారతీయుడి కలలను ఇది నెరవేరుస్తుందని ప్రధాని పేర్కొన్నారు. నిర్మలా సీతారామన్ ఈరోజు ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ. 12 లక్షల వరకు పెంచారు. ప్రధాని మోదీ బడ్జెట్‌ను శక్తి గుణకం అని అభివర్ణించారు ఈ బడ్జెట్ పొదుపులు, పెట్టుబడి, వినియోగం, వృద్ధిని వేగంగా పెంచుతుందన్నారు. ప్రజల బడ్జెట్(Budget 2025) పై తాను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆమె మొత్తం బృందాన్ని అభినందిస్తున్నాను అంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు.