అక్కినేని తెలుగు సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లారు.
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) 'మన్ కీ బాత్' 117వ ఎపిసోడ్‌లో తెలుగు దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao)కి నివాళులర్పించారు. ఏఎన్ఆర్ తెలుగు సినిమాను ఉన్నతంగా తీర్చిదిద్దారని, సంప్రదాయాలను, విలువలను ఆయన ఎలా ఆదర్శప్రాయంగా చిత్రించారో ఎత్తిచూపారని మోదీ కొనియాడారు. ప్రసార సమయంలో, మోడీ బాలీవుడ్(Bollywood) ప్రముఖులు తపన్ సిన్హా, రాజ్ కపూర్‌లను కూడా ప్రస్తావించారు. భారతీయ సినిమావైపు ప్రపంచ దేశాలు చూస్తున్నాయని ప్రధాని వెల్లడించారు. వచ్చే ఏడాది ప్రపంచ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్(Audio Visual Entertainment Summit)కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుందన్నారు. ఈ సమ్మిట్ ఇండియాలో నిర్వహించడం ఇదే లొలిసారని పేర్కొన్నారు. రాజ్యాంగానికి 75 ఏళ్లు పూర్తియిన సందర్భంగా ప్రత్యేక వెబ్ సైట్ ఏర్పాటు చేస్తామన్నారు. రాజ్యాంగంపై మీ అభిప్రాయాలు ఈ వెబ్ సైట్ లో పంచుకోవాలని కోరారు. జనవరి 13 నుంచి జరిగే మహాకుంభమేళ.. ఐక్యతా వేళా అన్నారు. కుంభమేలా నిర్వహణకు ఏఐ సహా ఆధునిక సాంకేతికత వాడనున్నట్లు తెలిపారు. కుంభమేళా(Kumbh Mela) సమాచారం తెలుసుకునేందుకు ఏఐ చాట్ బాట్. కుంభమేళాలో ప్రమాదాల నివారణకు రోబోటిక్ ఫైర్ టెండర్లు ఏర్పాటు చేస్తామన్నారు.