గాంధీనగర్: గుజరాత్ లో గ్లోబల్ రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్, ఎక్స్ పో సదస్సును ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ప్రారంభించారు. గాంధీనగర్ లో 3 రోజుల పాటు ఈ సదస్సు కొనసాగనుంది. గ్లోబల్ రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ లో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొనున్నారు. గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ కార్యక్రమ భాగస్వాములుగా ఉన్నాయి. ఎగ్జిబిషన్ సెంటర్ లో తెలంగాణ తరుఫున రెన్యువబుల్ ఎనర్జీ స్టాల్ ఏర్పాటు చేశారు. దేశీయ, విదేశీ పెట్టుబడిదారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.