న్యూఢిల్లీ: దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్(Manmohan Singh) కన్నుమూశారు. ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) నివాళలర్పించారు. మన్మోహన్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గత రాత్రి కన్నుమూసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో కేంద్ర హోంశాఖ అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాళులర్పించారు. ప్రజల సందర్శనార్థం మన్మోహన్ సింగ్ నివాసానానికి పార్థివదేహాన్ని తరలించారు. రేపు ఏఐసీసీ (All India Congress Committee) ప్రధాన కార్యాలయాంలో ప్రజల సందర్శనార్థం మన్మోహన్ సింగ్ పార్థివదేహం ఉంచనున్నారు.
శనివారం ఢిల్లీ రాజ్ ఘాట్ సమీపంలో మన్మోహన్ సింగ్ అంతిమ సంస్కరాలు నిర్వహించనున్నారు. కేంద్రప్రభుత్వం(Central Government)అధికారిక లాంచనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించనుంది. మన్మోహన్ సింగ్ మృతికి కేంద్ర 7 రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శలకు కేంద్ర హోంశాఖ సమాచారం ఇచ్చింది. ఏడు రోజులపాటు ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించవద్దని ఆదేశించింది. వారంపాటు వేడుకలు నిర్వహించకూడదని కేంద్ర ఆదేశించింది.