calender_icon.png 20 April, 2025 | 1:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సావర్కర్ బాటలో ప్రధాని మోదీ

17-12-2024 02:06:26 AM

* బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కులగణన చేయాలి 

* పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు 

హైదరాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాంతి) : వీరసావర్కర్ బాటలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నడుస్తున్నాడని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు ఆరోపించారు. ఈ దేశానికి వీరసావర్కర్ ఏమి చేశాడో బీజేపీ నేతలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. మోదీది అంతా ఆర్‌ఎస్‌ఎస్ ఆలోచనేనని విమర్శించారు. ఓబీసీ అని చెప్పుకొనే మోదీ ఓబీసీలకు చేసిందేమీ లేదన్నారు. పేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎప్పుడు న్యాయం చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి మొదలు పెట్టిన కులగణన 90 శాతానికి పైగా పూర్తయిందని.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కులగణన ఎప్పుడు చేస్తారో చెప్పాలని వీహెచ్ డిమాండ్ చేశారు.