calender_icon.png 29 September, 2024 | 1:46 PM

Mann Ki Baat: 20 వేల భాషలకు భారత్ పుట్టినిల్లు

29-09-2024 11:38:55 AM

నీటి నిర్వహణ చాలా కీలకం: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: గత కొన్ని వారాలుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని, ఈ వర్షాకాలం 'నీటి సంరక్షణ' ఎంత ముఖ్యమో మనకు గుర్తు చేస్తుందని ప్రధాని మోడీ అన్నారు. ఆదివారం ప్రధాని మోడీ 'మన్ కీ బాత్' 114వ ఎపిసోడ్ నిర్వహించారు. నీటి సంరక్షణకు అనేక కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. బీచ్ ల వద్ద శుద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు. 20 వేల భాషలకు భారత్ పుట్టినిల్లు అన్నారు. 'తల్లి పేరిట' మొక్క కార్యక్రమం విజయవంతగా సాగుతోందని చెప్పారు. యూపీలో 'తల్లి పేరిట' మొక్క కింద 26 కోట్ల మొక్కలు నాటారని తెలిపారు. గుజరాత్ లో 15 కోట్లకు పైగా మొక్కలు నాటార న్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేడియో షో పదేళ్లు పూర్తి చేసుకుంది. నీటి సంరక్షణకు మహిళా రైతులు చేస్తున్న కృషిని ప్రధాని ప్రశంసించారు. ప్ర‌తి నెలా కార్య‌క్ర‌మానికి లేఖ‌లు, సూచ‌న‌లు పంపుతున్న అసంఖ్యాక‌ మందికి ప్ర‌ధాన మంత్రి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.