అనేక రంగాల్లో మేడిన్ ఇండియా సత్తా చాటుతాం
గాంధీనగర్: పీఎం సూర్యఘర్ పథకం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ప్రధానిమోడీ అన్నారు. సూర్యఘర్ పథకం ద్వారా దేశంలోని ప్రతి ఇల్లు విద్యుదుత్పత్తి చేయాలన్నారు. సౌరవిద్యుత్ వినియోగం ద్వారా ఏడాదిలో రూ. 25 వేలు పొదుపు చేయవచ్చని చెప్పారు. పొదుపు చేసిన మొత్తంతో ప్రతి ఇంట్లో పిల్లలను చదివించుకోవచ్చని తెలిపారు. సౌరవిద్యుత్ ద్వారా వాతావరణ కాలుష్యాన్ని మరింత తగ్గించవచ్చని వెల్లడించారు.
పీఎం సూర్య ఘర్.. సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన పథకం అన్నారు. అయోధ్యను మోడల్ సోలార్ సిటీగా మార్చడమే తమ లక్ష్యమని ప్రధాని పేర్కొన్నారు. అయోధ్యలోని అనేక ఇళ్లు, కార్యాలయాలకు సౌరవిద్యుత్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. వ్యవసాయ రంగంలోనూసౌరవిద్యుత్ వినియోగం పెరుగుతోందని ఆయన చెప్పారు. గ్రీన్ హైడ్రోజన్ రంగంలో ప్రపంచంలోనే నెంబర్ వన్ గా మారుతున్నామని పేర్కొన్నారు. రైల్వేలో బయో టాయిలెట్లు మరిన్ని పెంచుతామని ప్రధాని వెల్లడించారు. అనేక రంగాల్లో మేడిన్ ఇండియా సత్తా చాటుతామని తెలిపారు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలో భారత్ ది ప్రత్యేక స్థానమని ఆయన స్పష్టం చేశారు