ముంబై: మహారాష్ట్రలో ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi ) బుధవారం పర్యటిస్తున్నారు. ప్రధానమంత్రి ముంబైలోని నేవల్ డాక్‌యార్డ్‌లో మూడు ఫ్రంట్‌లైన్ ఇండియన్ నేవీ నౌకలు-ఐఎన్‌ఎస్ సూరత్, ఐఎన్‌ఎస్ నీలగిరి, ఐఎన్‌ఎస్ వాఘ్‌షీర్‌లను ప్రారంభించారు. ఐఎన్ఎస్ సూరత్, నీలగిరి యుద్ధనౌకలు, వాఘ్ షీర్ జలాంతర్గామిని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు. భారత నౌకాదళం, రక్షణ సామర్థ్యాలలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నేవీ అభివర్ణించింది. పీ15 బీ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ ప్రాజెక్టులో చివరి నౌక ఐఎన్ఎస్ సూరత్. ప్రపంచంలోనే అతిపెద్ద, అధునాతన డిస్ట్రాయర్లలో ఐఎన్ఎస్ సూరత్ ఒకటి. పీ17ఏ స్టీల్త్ ఫ్రిగేట్ ప్రాజెక్టులో తొలి నౌక ఐఎన్ఎస్ నీలగిరి. అధునాతన సీకీపింప్, స్టెల్త్ సామర్థ్యంలో ఐఎన్ఎస్ నీలగిరి రూపొందింది. పీ75 స్కార్పీన్ ప్రాజెక్టులో చివరి జలాంతర్గామి ఐఎన్ఎస్ వాఘ్ షీర్.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ... ఈ పోరాట యోధుల ప్రేరేపణ స్వావలంబన దిశగా భారతదేశం పురోగతిని ప్రతిబింబిస్తుందని, దాని ప్రపంచ రక్షణ నాయకత్వాన్ని బలోపేతం చేస్తుందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. రక్షణ రంగంలో 'మేకిన్ ఇండియా' ఆవిష్కృతమవుతోందన్నారు. మేం విస్తరణవాదంతో కాదు.. వికాసవాదంతో పనిచేస్తామన్నారు. వన్ ఎర్త్.. వన్ ఫ్యామిలీ.. వన్ ఫ్యూచర్.. INS సూరత్, INS నీలగిరి యుద్ధనౌకలు, INS వాఘ్‌షీర్ జలాంతర్గామి భారత్‌కు మరింత శక్తినిస్తాయని పేర్కొన్నారు. ప్రపంచంలో బలమైన శక్తిగా భారత్ మారుతోందన్నారు. భద్రమైన సముద్ర మార్గాల కోసం ప్రయత్నిస్తున్నాం.. నేవీ బలోపేతం వల్ల ఆర్థిక ప్రగతి కూడా కలుగుతుందని ప్రధాని మోడీ తెలిపారు.