calender_icon.png 8 January, 2025 | 2:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ

06-01-2025 03:12:33 PM

హైదరాబాద్: చర్లపల్లి కొత్త రైల్వే టెర్మినల్ స్టేషన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) సోమవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వర్చువల్ గా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు సోమన్న, కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ... కనెక్టివిటీకి అత్యంత ప్రాధాన్యాం ఇస్తున్నామని పేర్కొన్నారు. మెట్రో నెట్ వర్క్ 1000 కిలోమీటర్లకు పైగా పరిధి విస్తరించిందని ప్రధాని తెలిపారు. జమ్ము కశ్మీర్, ఒడిశా, తెలంగాణ(Telangana)లో కొత్త కనెక్టివిటీకి ఏర్పాట్లు జరిగాయని చెప్పారు. ఒక్కో అడుగు వేసుకుంటూ దేశంలో కొత్త పుంతలు తొక్కిస్తున్నామని వెల్లడించారు.

రైల్వే ఆధునికీకరణకు ప్రాధాన్యం ఇస్తున్నామన్న ప్రధాని రైల్వే రంగంలో మౌలిక సదుపాయాలకు ప్రధాన్యం ఇస్తున్నామని తెలిపారు. హై స్పీడ్ రైళ్ల(High Speed Trains) కోసం డిమాండ్ పెరుగుతోందని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచేలా కృషిచేస్తున్నామని పేర్కొన్నారు. దేశంలో 35 శాతం విద్యుదీకరణ పూర్తి అయ్యిందన్నారు. వందేభారత్, అమృత్ భారత్, నమో భారత్ రైళ్లు అందుబాటులోకి తెచ్చామని ప్రధాని పేర్కొన్నారు. వందేభారత్ ఎక్స్ ప్రెస్(Vande Bharat Express)లో స్లీపర్ వంటి సౌకర్యాల అందుబాటులో ఉన్నాయన్నారు. దశాబ్ద కాలంలో రైల్వే కొత్త రూపు సంతరించుకుందన్న ఆయన రైల్వేల ఆధునికీకరణ దేశం ముఖచిత్రాన్నే మారుస్తోందని స్పష్టం చేశారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను ఆర్ఆర్ఆర్ కు అనుసంధానం చేయాలన్నారు. 

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని కొత్త టెర్మినల్ స్టేషన్‌ను కొత్త కోచింగ్ టెర్మినల్‌గా అభివృద్ధి చేయడంతోపాటు సెకండ్ ఎంట్రీని దాదాపు రూ.413 కోట్లతో అభివృద్ధి చేశారు. ఈ పర్యావరణ అనుకూల టెర్మినల్, మంచి ప్రయాణీకుల సౌకర్యాలను కలిగి ఉండటం వలన సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ వంటి నగరంలో ప్రస్తుతం ఉన్న కోచింగ్ టెర్మినల్స్‌లో రద్దీ తగ్గుతుంది. చర్లపల్లి టెర్మినల్(Charlapalli Terminal) నుండి రోజుకు సుమారు 24 రైళ్లు నడుస్తాయి. గూడ్స్ రైళ్లకు కేంద్రంగా చర్లపల్లి టెర్మినల్ హైదరాబాద్ పారిశ్రామిక రంగ అభివృద్ధికి మరింత ఊతమివ్వనుంది. కొత్త టెర్మినల్‌లో ద్విచక్ర వాహనాలు, మూడు చక్రాల వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలు, ప్రత్యేక బస్ బే వంటి వాటికి తగిన పార్కింగ్‌తో పాటు విశాలమైన సర్క్యులేటింగ్ ప్రాంతంతో పాటు ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. పునరభివృద్ధి కొత్త రైలు సేవలను ప్రవేశపెట్టడానికి మార్గం సుగమం చేస్తుంది, కొన్ని సంక్రాంతి ప్రత్యేక రైళ్లు(Sankranti Special Trains) ఈ స్టేషన్ నుండి నడపడానికి సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.