02-03-2025 11:39:50 AM
న్యూఢిల్లీ,(విజయక్రాంతి): భారత దేశంలో పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమైంది. శనివారం సాయంత్రం రంజాన్ మాసం చందమామ దర్శనమిచ్చిన అనంతరం ముస్లీం ప్రజలు ఒకరికి ఒకరు శుభకాంక్షలు చెప్పుకున్నారు. ఆదివారం నుంచి దేశవ్యాప్తంగా ముస్లీంలు ఉపవాసాలు ప్రారంభించారు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముస్లీంలు ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ మన సమాజంలో శాంతి, సామరస్యాన్ని తీసుకురావాలని, ఈ పవిత్ర మాసం ప్రతిబింబం, కృతజ్ఞత, భక్తిని ప్రతిబింబిస్తుందన్నారు. కరుణ, దయ, సేవ వంటి విలువలను కూడా మనకు గుర్తు చేస్తుంది. రంజాన్ ముబారక్! అని ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ లో పేర్కొన్నారు.