20-04-2025 10:39:05 AM
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) ఆదివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు(Chandrababu 75th Birthday) తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన నిరంతర కృషిని ప్రశంసించారు. ప్రధానమంత్రి ఎక్స్ లో ఇలా రాశారు, “నా మంచి స్నేహితుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు శుభాకాంక్షలు. భవిష్యత్ రంగాలపై దృష్టి సారించి చంద్రబాబు పనిచేస్తున్నారు. ఆయన ఏపీ అభివృద్ధి కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్న తీరు ప్రశంసనీయం. చంద్రబాబుకు దీర్ఘాయుష్షు, ఆరోగ్యకరమైన జీవితం ప్రసాధించాలని ప్రార్థిస్తున్నాను.” అని ఎక్స్ లో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్(Andhra Pradesh Governor Abdul Nazeer) కూడా సోషల్ మీడియా ద్వారా తన శుభాకాంక్షలు తెలియజేస్తూ, “ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి పుట్టినరోజు సందర్భంగా నా హృదయపూర్వక అభినందనలు, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు తన 75వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లు ఆయన జన్మదిన సంబురాలు జరపుకుంటున్నారు. చంద్రబాబు ఉమ్మడి విభజించబడిన ఆంధ్రప్రదేశ్ రెండింటిలోనూ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2024లో, ఆయన నాల్గవసారి అధికారంలోకి వచ్చారు, అసెంబ్లీలో 164 స్థానాలను గెలుచుకున్న సంకీర్ణానికి నాయకత్వం వహించారు.