24 May, 2026 | 4:38 PM

పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా ప్రధాని దిష్టిబొమ్మ దహనం

24-05-2026 03:26 PM

బోథ్(విజయక్రాంతి): దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం బోత్ లో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం పెట్రోల్ ధరలు పెంచి ప్రజలను మోసం చేసిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించారు. ప్రభుత్వం తీరు నిరసిస్తూ ప్రధాని దిష్టిబొమ్మను దగ్ధం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెట్రోల్ ధరల పెంపు ఫలితంగా నిత్యవసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తపరిచారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ తో పాటు కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ కన్వీనర్ శ్రీకాంత్ రెడ్డి సీనియర్ నాయకులు సురేందర్ అబుదు యువజన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఉపాధ్యక్షులు అనీష్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పాల్గొన్నారు.