calender_icon.png 16 January, 2025 | 1:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత హాకీ జట్టుకు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ

08-08-2024 08:32:48 PM

న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్ హాకీ పోటీలో భారత్ జట్టు కాంస్యం సాధించింది. కాంస్య పతకం సాధించిన భారత్ హాకీ జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు మెరిసిందని, వరుసగా రెండో పతకం సాధించిందని ప్రధాని మోదీ తెలిపారు. భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయక ప్రదర్శన చేశారని, భారత హాకీ జట్టు బృందం స్ఫూర్తిని చాటిందన్నారు. ప్రతి భారతీయుడికి హాకీతో మంచి అనుబంధం ఉందని, ఈ విజయంతో హాకీ మరింత ప్రాచుర్యం పొందేలా చేస్తుందని  ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారత హాకీ జట్లుకు ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువడుతున్నాయి.