calender_icon.png 4 February, 2025 | 4:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ సీఎం కేసీఆర్‌కు ప్రధాని మోదీ లేఖ

04-02-2025 02:07:40 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అక్క చీటి సకలమ్మ మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ కి సంతాప సందేశాన్ని ప్రధాని మోదీ పంపారు. అక్క మరణంతో బాధాతప్త హృదయంతో ఉన్న కేసీఆర్ కి, వారి కుటుంబ సభ్యులకు ప్రధాని తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ లేఖను రాసారు. శ్రీమతి చీటి సకలమ్మ గారి మరణవార్త తెలుసుకుని తీవ్ర దిగ్ర్భాంతి చెందానని లేఖలో ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ఈ అనుకొని ఘటన ఎంతో బాధకు గురిచేసిందని, కుటుంబ సభ్యలకు తీరని లోటుగా మిగిలిపోతుందన్నారు. అలాగే కుటుంబ సభ్యులకు ఆమె అందించిన విలువలు, నడిపించిన మార్గదర్శనం ఎప్పటికీ వారికి ప్రేరణగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. చీటీ సకులమ్మ మరణం పట్ల రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పలువురు రాజకీయ నాయకులు, నేతలు సంతాపం తెలిపారు. ఇక కేసీఆర్ ఫౌంహౌస్ నుంచి సోదరి ఇంటికి చేరుకొని ఘన నివాళులర్పించారు. ఆయనతో పాటు హరీశ్ రావు, కేటీఆర్, కవిత సైతం సకులమ్మ పార్థివ దేహానికి నివాళ్లు అర్పించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న సకులమ్మ(82) హైదరాబాద్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు.