16-02-2025 11:03:27 AM
న్యూఢిల్లీ: దిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. అటు దిల్లీ తొక్కిసలాట ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) ఆరా తీశారు. రైల్వే మంత్రి, దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, దిల్లీ సీపీతో అమిత్ షా ఫోన్ లో మాట్లాడారు. సహాయ చర్యలు చేపట్టాలని హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని అమిత్ షా ఆకాంక్షించారు.
ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభ్(Prayag Kumbh Mela)కు రైళ్లను ఎక్కేందుకు ప్రయత్నించిన ప్రయాణికుల ఆకస్మిక రద్దీ కారణంగా శనివారం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్(New Delhi Railway Station)లో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మహిళలు, ఐదుగురు పిల్లలు సహా కనీసం 18 మంది మరణించారు. ఈ దురదృష్టకర సంఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.